Friday, November 22, 2024

TS: మాయ మాటలకు మోస పోకండి.. బీఆర్ఎస్ తోనే సంక్షేమం.. ఎమ్మెల్యే దాసరి

ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రతిపక్ష నాయకులు మాయమాటలు చెబుతారని, వాటిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని 6వ వార్డులో గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, పెద్దపల్లిలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధిని మర్చిపోయారన్నారు. 40ఏళ్లలో జరగని అభివృద్దిని 9 ఏళ్లలో చేసి చూపామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ విజయం సాధించడం పక్కా అని, పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగిరే విధంగా సహకరించాలన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందని, జిల్లా కేంద్రంలో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టర్లతో పాటు ఇతర పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో పెద్దపల్లిని జిల్లాగా మార్చారని, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. గత పాలకులు రోడ్లు విస్తరించ లేక పోయారన్నారు. అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారన్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరో అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు పెద్ది గీతాంజలి వెంకటేష్, పెంచాల రమాదేవి శ్రీదర్, రాజకుమార్ తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement