Thursday, September 5, 2024

టైమ్‌కు రాని డాక్ట‌ర్లు.. హాస్పిట‌ల్‌కు వ‌చ్చేవారికి ఇబ్బందులు..

పెద్దకొడప్‌గల్‌, (ప్రభన్యూస్‌) : నిరుపేద ప్రజలకు కార్పోరేట్‌ స్థాయిలో వైధ్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పాలకులు చెప్తున్న ప్పటికి అది ఆచరణకు నోచుకోవడం లేదని స్పష్టమవుతుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సిబ్బంది కొరత, సౌకర్యాల లేమితో రోగులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైధ్యులు సరిగా సమయపాలన పాటించకపో వడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పెద్దకొడప్‌గల్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు పేదోడికి వైధ్యం అందడం లేదని స్థానికులు ఆదివారం ధర్నాకు దిగారు.

శనివారం రాత్రి 7 గం.ల సమయంలో పెద్దకొడప్‌గల్‌ గ్రామానికి చెందిన గూల.సాయిలు తన భార్య లక్ష్మీతో కలిసి తన వద్ద గల ద్విచక్ర వాహనంపై పిట్లం నుండి పెద్దకొడప్‌గల్‌కు వస్తుండగా బేగంపూర్‌ గేటు వద్ద వరి కుప్పలపై ద్విచక్ర వాహనాన్ని ఎక్కించి అదుపుతప్పి పడిపోయారు దాంతో స్తానికులు వారిని పెద్దకొడప్‌గల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆసుపత్రిలో సిబ్బంది లేక ఎవ‌రు ప‌ట్టించుకోక పోవ‌డంతో దాదాపు గంట సేపు వేచి చూదాల్సిన ప‌రిస్తితి నెత‌కోంది.

ఆసుపత్రికి వెళ్తే అక్కడ వైధ్యులు ఉండరు. ఉన్న వైధ్యులు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహౄరిస్తూ ఉండడంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సంబందిత అధికారి, సిబ్బం ది లేకపోవడంతో ప్రతీ సోమవారం ఆసుపత్రికి పరీక్షల కొరకు వచ్చే గర్బిణీలు మధ్యాహ్నం 12 గం.ల వరకు వేచి చూడాల్సిన ప‌రిస్తితి నెల‌కోంది. వైధ్యులు లేని సమయంలో సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ ఆసుపత్రిలో కొనసాగుతుందని రోగులు ఆరోపిస్తున్నారు.ఈ పీహెచ్‌సీలో వైధ్యుడు ఒక్కడే విధులు నిర్వహిస్తున్నాడని, ఉన్నతాధికారుల పర్యావేక్షణ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.

రాత్రిళ్ళు ఎవరైనా గర్బిణీలు వస్తే మెడికల్‌ ఆఫీసర్‌ లేకపోవడంతో ఏఎన్‌ఎంలు ప్రసవం చేస్తున్నారు. ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌ పోస్టు 2, 5 సబ్‌సెంటర్లలో 10 మంది ఎఎన్‌ఎంలు పనిచేయవలసి ఉండగా 5 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో రోగులు కిందనే పడుకోవాల్సి వస్తోంది. ఆపరేషన్‌ సమయంలో మెడికల్‌ ఆఫీసర్‌ లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు రోగులను రిఫర్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇద్దరు స్టాఫ్‌నర్స్‌, ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, ఒక టెండర్‌ పోస్టులను భర్తీ చేసి సౌకర్యాలు కల్పించి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇప్పటికైనా సంబందిత అధికారులు ఆసుపత్రిలో సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వ‌హించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తిర్మల్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండలాధ్యక్షుడు రమేష్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement