తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలోని వైద్య విద్య విభాగంలో అనుమతి లేకుండా సుదీర్ఘకాలంగా సెలవుల్లో ఉన్న 38 మంది వైద్యులపై చర్యలకు రంగం సిద్ధమైంది. వీరి సర్వీస్‌ను టెర్మినేట్ చేయాల్సిందిగా డీఎంఈ డా.రమేష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అనుమతి లేకుండా సెలవులపై వెళ్లినందున సర్వీస్ టెర్మినేట్‌కు ప్రత్యేక కమిటీ కూడా సిఫారసు చేసిందన్నారు.
ఈ 38 మంది వైద్యులకు షోకాజ్ నోటీస్ ఇచ్చినా స్పందన లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సబ్ ఆర్డినెట్ రూల్స్ చట్టం ప్రకారం సర్వీస్ టెర్మినేట్ చేయాలని ఆయా ఆసుపత్రుల అధిపతులను డీఎంఈ ఆదేశించారు. సర్వీస్ టెర్మినేట్ అయిన వారి వివరా లను మీడియాలో, గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital