మహబూబ్నగర్,క్రైమ్ సెప్టెంబర్ 2 (ప్రభ న్యూస్): కన్నపేగే కాటేయాలని కవలల కు విషమిస్తే ప్రాణాపాయ స్టితిలొ పాలమూరు రవి చిల్డ్రన్స్ ఆసుపత్రికి చేరారు. అక్కడి యాజమాన్యం వైద్యులు వారికీ ప్రాణం పోశారు. నేటికీ ఈ ఘటన జరిగి మూడేళ్లు శుక్రవారం వారి జన్మదిన వేడుకలను ఆసుపత్రిలో సంబురంగా నిర్వహించారు. 2020 వ సంవత్సరంలో జరిగిన దురదృష్ట సంఘటన గండీడ్ మండలం దేశాయి పల్లికి చెందిన ఇద్దరూ చిన్నారుల మీద ఆడపిల్లలుగా పుట్టడం వలన వారి కన్న తండ్రి ఆ కవల పిల్లలకు విష ప్రయోగం చేయడం జరిగింది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో వైద్య సహాయం కోసం మహబూబ్నగర్ పట్టణంలోని రవి చిన్నపిల్లల వైద్యశాలకు ఆ చిన్నారులను తీసుకొచ్చింది కన్నతల్లి.
విషయం తెలుసుకుని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శేఖర్ స్వీయ పర్యవేక్షణలో వైద్య బృందం ఆసుపత్రి గేటు వద్ద నుండే పిల్లలకు వైద్య సహాయం అందించారు.ఆ తరువాత 22 రోజులపాటు అత్యంత ఖరీదైన వైద్యాన్ని 6.50 (ఆరు లక్షల 50 వేలు) ఉచితంగా అందించి ఆ ఇద్దరి పిల్లలను ప్రాణాపాయం నుండి రక్షించడంలో రవి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్య బృందం 24 గంటలుఎంతో కృషి చేసింది.
కాగా ,శుక్రవారం నాటికి ఆ కవలలు మూడు సంవత్సరములు నిండినందున వారి పుట్టినరోజు వేడుకల సంబరాలను రవి చిన్నపిల్లల హాస్పత్రి ప్రాంగణంలో డాక్టర్ శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు.అదేవిదంగా డాక్టర్ శేఖర్ రవి ఫౌండేషన్ తరపున పదివేల రూపాయల చెక్కును కూడ బహుమానంగా ఆ కవలల తల్లికి అందజేశారు. ఈ సందర్భంగా వారి కన్నతల్లి మాట్లాడుతూ తన బిడ్డలకు ప్రాణ దానం చేసినందుకు రవి చిన్నపిల్లల వైద్యశాల వైద్య బృందానికి, ప్రత్యేకంగా డాక్టర్ శేఖర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రవి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్య బృందం, అనేకమంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.