Friday, November 22, 2024

MBNR | ఎమ్మెల్యే వాకిటికి డాక్టరేట్..

సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ప్రధానం
మక్తల్, అక్టోబర్ 19 (ఆంధ్రప్రభ) : మక్తల్ ఎమ్మెల్యే ఇక డాక్టర్ వాకిటి శ్రీహరి అయ్యారు. గత 30సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజలకు సేవలు అందిస్తూనే అనేక సామాజిక, సహాయక కార్యక్రమాలు చేపడుతూ ప్రమాదాల్లో గాయపడిన వారిని తన చేతులతో తన వాహనంలో ఎక్కించుకొని మరి ఆసుపత్రులకు తీసుకువెళ్లి సొంత ఖర్చులతో వైద్యం చేయించడం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికీ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వర్చ్యువల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరి వారిచే గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని ఇవాళ తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరిలోనీ కంబన్ కళారై ఆరాగం వేదికగా జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాండిచ్చేరిలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా గౌరవ డాక్టరేట్ అందుకున్న సమావేశంలో తెలుగులో ప్రసంగించారు. మాతృభాషలో మాట్లాడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేతో ఫోటోలు దిగేందుకు అక్కడి ప్రముఖులు పోటీపడ్డారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తన జీవిత కాలంలో చివరి అంకం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడతానని ప్రకటించారు. తన సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు డాక్టరేట్ ను అందించిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మక్తల్ నియోజకవర్గ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement