Friday, November 22, 2024

TS: తెచ్చుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టకండి.. మంత్రి గంగుల

కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టకండని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 50 ఏళ్లుగా తెలంగాణకు రోడ్లు, నీళ్లు, కరెంటు తేని మోసగాళ్ల పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామస్థులు గంగులకు ఘన స్వాగతం పలుకగా.. డప్పు చప్పుళ్ళ మధ్య పాదయాత్ర చేసి ఇంటింటికి తిరుగుతూ ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెచ్చుకున్న తెలంగాణ ఆంద్రుల చేతుల్లో పెట్టకండి, తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతుల్లో పెట్టకండి, తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ది చేసుకోవడానికి కేసీఆర్ చేతుల్లో పెట్టండి, నాకు ఓటేసి గెలిపించండి అని అభ్యర్థించారు.

గతంలో మన తాతలు ఆంధ్రలో కలపడం వల్ల 60ఏళ్లు అరిగోస పడ్డామని, అరవై ఏళ్లు వెనుకబాటుకు గురయ్యామని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలకు ఓటేసి అదే తప్పును మళ్లీ మనం చేయొద్దని వేడుకున్నారు మంత్రి గంగుల. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి తర్వాత ఎంపీగా గెలిపించారు, కానీ ఏనాడైనా మీ సమస్యల కోసం మీ దగ్గరికి వచ్చారా అని ప్రశ్నించారు మంత్రి గంగుల. మళ్లీ నేడు ఓట్లకోసం వస్తున్నాడని, ఇలాంటి వాళ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనునిత్యం అందుబాటులో ఉంటూ స్థానికంగా నీళ్లు, కరెంటు తెచ్చి రోడ్లు వేయించి, వాటి రిపేర్లను సైతం చేయిస్తూ మీ సేవ చేసుకున్న వ్యక్తి గంగుల కమలాకర్ అన్నారు. ప్రతిపక్షాలు కేవలం ఎన్నికలప్పుడే వస్తాయని, కల్లబొల్లి మాటలు చెప్తాయని గుర్తించుకోవాలన్నారు. అందుకే అవి ఢిల్లీ పార్టీలని, కేవలం మన తెలంగాణ గల్లీ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. మరోసారి స్థానికంగా ఉండే తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని, తద్వారా మరింత అభివృద్ది, సంక్షేమం దిశగా కరీంనగర్ ను తీసుకెళ్లి సేవ చేసే భాగ్యం కల్గించాలని మంత్రి వేడుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement