న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రజానీకాన్ని టీఆర్ఎస్ పార్టీ మరోసారి మోసం చేయాలని చూస్తుందని బీజేపీ స్టేట్ సెంట్రల్ కో ఆర్డినేటర్ నూనె బాల్ రాజ్ విమర్శించారు. రాష్ట్రంలో పండిన పంటలను కొనడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నారు. రైతుల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందన్నారు. వరి వేస్తే ఉరే అంటూ చెప్పిన సీఎం కేసీఆర్.. తాను మాత్రం ఎందుకు వరి పండించారని ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ప్రతి గింజ ప్రభుత్వం కొనాల్సిందేని తెలిపారు. ధాన్యాన్ని కొని ఎఫ్ సి ఐ కి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అన్నారు. పీకే సలహాలతో పిచ్చి లేసినట్లు టీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు, మాయ మాటలు చెప్పిన తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.
దుబ్బాక, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీని ఓదించిన ప్రజలు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ను రోడ్ల మీదకు తీసుకువచ్చారని తెలిపారు. డ్రామారావులు ఎన్ని రంగులు ముసుగులు మార్చినా.. సినీ నటుడు రామారావులా కాలేరన్నారు. ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వడ్లను కొని తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి చేతులు దులుపుకుందామని చూస్తే బీజేపీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. చివరికి పీకేలు, ఎస్కేల పార్టీలకు మిగిలేదేమీ లేదన్నారు