Monday, January 13, 2025

TG | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అక్ర‌మాల‌కు తావివ్వొద్దు.. మంత్రి కోమ‌టిరెడ్డి

ఖ‌మ్మం – త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనలు ఉంటాయని, ఇందిర‌మ్మ ఇళ్ల‌పై ఆరా కూడా తీస్తార‌న్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. భవనాలున్న వారికి ఇళ్లు ఇస్తే మొదటి బాధ్యులు కలెక్టర్ అవుతార‌ని తేల్చి చెప్పారు. ఖ‌మ్మం జిల్లా క‌లెక్ట‌రేట్ లో నేడు జ‌రిగిన ఇందిర‌మ్మ ఇళ్ల స‌మీక్ష స‌మావేశంలో ఆయ‌న పాల్గొని మాట్లాడుతూ… అర్హులైన వారికి ఇళ్లు రావాలన్నారు. అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోహించాల్సి వుంటుంద‌ని తేల్చి చెప్పారు. అధికారులు, సిబ్బంది అలసత్వం ఉండొద్దని అంటూ, గ్రామాలు మీ ఇళ్లు అనుకుని పని చేయండని మంత్రి సూచించారు.

అలాగే, ప్రజాపాలనలో ప్రజలు ఎంతో ఆశతో, నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించారని కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి తెలిపారు. వారి కోసం ఒక్కొక్కటిగా పని చేసి పెడుతున్నామ‌ని పేర్కొన్నారు. ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ఈనెల 26 నుంచి అమలు చేస్తామన్నారు. ప్రతి అర్హుడైన పేదవాడికి న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. అర్హుడైన ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామ‌న్నారు. రెవెన్యూ మంత్రి కూడా ఖమ్మం జిల్లా వ్య‌క్తేన‌ని, ఆయన దగ్గర ఉండి పేద‌ల‌కు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తార‌ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement