అభివృద్ధి-సంక్షేమంపై మాట్లాడాలి తప్ప రాజకీయ నేతల ఇంట్లో వారి గురించి మాట్లాడటం చాలా దురదృష్టకరమని మంత్రి సబితారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి కేటీఆర్ కుమారుడిపై వచ్చిన కామెంట్స్ బాధాకరం అని, ప్రతి ఒక్కరు ఆ మాటలను ఖండించాలనీ కోరారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు డెవలప్‌మెంట్స్, అవినీతి వంటి అంశాలపై ఆధారాలతో విమర్శించండి.. సమస్యలను తెలియజేయండి..
కానీ, కుటుంబ సభ్యులు, పిల్లలపై కామెంట్స్ చేయడం ఎవరికీ అంతమంచిది కాదు అన్నారు. బాధ్యతగా ప్రజా సమస్యలపై విమర్శిస్తే చాలెంజ్ గా తీసుకొని పూర్తి చేస్తాం.. భాద్యత మరచి సంస్కార హీనంగా మాట్లాడితే విజ్ఞులు అయిన ప్రజలు గమనిస్తుంటారనీ సబితారెడ్డి అన్నారు.