Friday, November 22, 2024

Diversion Politics – స‌భ‌లో రేవంత్ తీరుపై హ‌రీశ్ గ‌రం గ‌రం ….

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – శాసనసభలో తప్పుడు ప్రకటనలతో అసెంబ్లీని కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ”గవర్నమెంట్ డిఫెన్స్‌లో పడినప్పుడు ఏదొక పేపర్ పట్టుకుని సభలోకి వచ్చి డైవర్షన్ చేస్తున్నారు. సభా నాయకుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదర్ దేన్ అగ్రికల్చర్ మీటర్స్ అనే పదాలను ఎగరగొట్టి చదివారు. అప్పులు 7 లక్షల కోట్లు అని తప్పుగా చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయలేదని చెప్పే ప్రయత్నం నేను చేస్తుండగా మోటర్లకు మీటర్లు పెట్టడానికి సంతకం చేశారని రేవంత్ లేచి సభను మిస్ లీడ్ చేశారు.” అని హరీశ్‌రావు మండిపడ్డారు.

”ఎల్‌ఆర్ఎస్ కోసం 25 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనీ… వాటిని క్లియర్ చేస్తే ఆదాయం వస్తుందని భట్టి చెబుతున్నారు. ఎల్‌ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఎల్‌ఆర్ఎస్‌పై కేసు విరమించుకుని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి కనీసం రాజీనామా కూడా చేయలేదు. నాడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రిజైన్ చేస్తూ జీరాక్స్ కాపీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి కనీసం ఆ జిరాక్స్ కాపీ కూడా ఇవ్వలేదు.” అని ఆరోపించారు.

- Advertisement -

”కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష చేయకుంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేదా?, 2001 నుంచి 2014 వరకు తెలంగాణ గురించి రేవంత్ ఏ రోజు మాట్లాడలేదు. కేసీఆర్ చేసినన్ని రాజీనామాలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయలేదు. అమరవీరుల ఆత్మ త్యాగాలను చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. 18 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేయలేదు. గత ఎన్నికల్లో పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయిందని మేము ఆ రోజు అన్నామా!, ఇండియా కూటమి 28 పార్టీల కలయికతో ఆ సీట్లు వచ్చాయి. 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు 21 శాతం ఓట్లు వచ్చాయి. రేవంత్ పనితీరు బాగలేకపోవడంతోనే మహబూబ్‌నగర్ ఎంపీగా ఓడిపోయారు. ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి పార్లమెంట్‌లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రేవంత్ సొంత జిల్లాలో లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయారు. 20 సీట్లు గెలిచినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాలేదా?, చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు కాంగ్రెస్‌లో చేరి సీఎం అయ్యారు. అసలు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ లాంటి నేతలు ఏమయ్యారు?, జైపాల్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వలేదు.” అని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement