Wednesday, November 27, 2024

TG| మాగనూరు పాఠశాలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ – ఘ‌ట‌న‌పై వివ‌రాల సేకరణ

మాగనూర్, నవంబర్ 27(ఆంధ్రప్రభ) : నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన నేపథ్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ బెన్ శాలం, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, ఆర్జెడి నర్సింహారెడ్డి సహా పలురు అధికారులు పాఠశాలను సందర్శించారు.

జిల్లా కలెక్టర్ పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఉపయోగిస్తున్న బియ్యంను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఉపాధ్యాయులు అధికారులతో సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ఫుడ్ పాయిజన్ కు గల కారణాల కోసం అధికారులు విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement