వికారాబాద్, డిసెంబర్ 3 (ఆంధ్రప్రభ): ప్రజాపాలన ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ జెండా ఊపి ప్రారంభించారు.
నిన్నేపల్లి చౌరస్తా నుండి వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వరకు ఈ టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన సంక్షేమ అధికారి హనుమంతరావు, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -