Thursday, November 21, 2024

RR: విత్తనాల షాప్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్, మే 31 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సురేష్ ఏజెన్సీ వితరణ షాపును వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ వికారాబాద్ మండల వ్యవసాయ అధికారి జ్యోతితో కలిసి స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన ఎవరు నకిలీ విత్తనాలు విక్రయించినా కఠిన చర్యలు తప్పని సంబంధిత షాప్ ను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. రైతులకు ఎవరు విచారాలను నకిలివి విక్రయించిన సంస్థలపై పీడీఎఫ్ నమోదు చేయడం జరుగుతుందని ఎవరు కూడా ప్రసిద్ధి లేని విత్తనాలు కొనకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మండల వ్యవసాయ అధికారి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement