సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి 10వ తరగతిలో 10/10 జీపీ సాధించాడు. అలాగే ఎంతో కష్టపడి చదివి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ తిరుపతి కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ లో సీటు సాధించాడు.
అయితే, ఐఐటీలో చేరేందుకు పేదరికం అడ్డు రావడంతో… జిల్లా కలెక్టర్ స్పందించి చదువుకునేలా ఆదుకున్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో ఆర్యన్ రోషన్‌కు 40,500 విలువైన హెచ్‌పి ల్యాప్‌టాప్‌తో పాటు ఐఐటి మొదటి సెమిస్టర్ ఫీజును జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగవాల్‌తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు….
బి.ఆర్యన్ రోషన్ తండ్రి తన చిన్నతనంలోనే మరణించినా… తల్లి రాజమణి రోజు కూలి చేసి తనను చదివించగా పట్టుదలతో చదివి ఐఐటిలో సీటు పొందినందుకు అభినందనలు తెలుపుతూ.. ఇలాగే ఐఐటి పూర్తి చేసుకోని అత్యున్నత శిఖరాలు అధిరోహించి చదువుకోవాలనే ఆసక్తిగల నీలాంటి నిరుపేదలకు ప్రతి ఓక్కరికి స్పూర్తి దాయకంగా నిలవాలని ఆకాంక్షించారు.