ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అధికారులు, కార్యాలయ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బందిచే జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన బాధ్యత అని, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల సంఘం చేసిన సంస్కరణలను వివరించారు. క్రొత్తగా ఓటరు గుర్తింపు కార్డు పొందాలంటే మీ-సేవా, నెట్ కేంద్రం నుండి దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా సాంకేతికత పెంపొందడంతో స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కొత్తగా ఓటు హక్కు నమోదు, చేర్పులు, మార్పులు, సవరణలు అవకాశం ఏర్పడడంతో సేవల్లో పారదర్శకత ఏర్పడిందన్నారు.
ఈ సందర్భంగా క్రొత్తగా ఓటు అర్హత పొంది ఓటర్ గా పేరు నమోదు చేసుకున్న నూతన ఓటర్ లకు ఓటర్ ఐడి కార్డులను అందజేశారు. భారత దేశ పౌరుల మైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ సాంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా, ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుములంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని ప్రతిజ్ఞ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..