Wednesday, January 22, 2025

NZB | ఎంపీ కార్ప‌స్ ఫండ్ ద్వారా సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ

నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 22(ఆంధ్రప్రభ) : నిజామాబాద్ లోని ఎంపీ కార్యాలయంలో అర్వింద్ ధర్మపురి బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా పార్లమెంట్ పరిధిలోని 33 మంది బూత్ స్థాయి కార్యకర్తలకు బుధవారం రూ.13.65 లక్షల చెక్కులను అసెంబ్లీ కన్వీనర్లు, మండలాల అధ్యక్షుల చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ… చనిపోయిన, వివాహమైన, నూతన గృహ ప్రవేశం, హాస్పిటల్ బిల్లులు, తదితర కేసులకు తన ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలకు తగిన సహాయం చేస్తానన్నారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్లు, మండలాల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement