హీమోఫిలియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా 10లక్షల విలువైన ఇంజిక్షన్లను పంపిణీ చేశారు. హీమోఫిలియాతో బాధపడుతూ త్వరలో వార్షిక పరీక్షలకు హాజరవుతున్న 37ఎస్ఎస్సీ, ఇంటర్ విద్యార్థులకు శరీరంలో అంతర్గతంగా జరిగే రక్తస్రావాన్ని నిలువరించేందుకు ముందు జాగ్రత్తగా ఫ్యాక్టర్ 8, 9 ఇంజిక్షన్ వేయించుకునేందుకు హీమోఫిలియా హైదరాబాద్ సోసైటీ, ఇంటాక్ ఫౌండేషన్ సంయుక్తంగా బాధితులకు అందించారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని లిటిల్ స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో పెషెంట్ అసిస్టెంట్స్ కార్యక్రమాన్ని హీమోఫిలియా సోసైటీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో వ్యాధిగ్రస్త విద్యార్థులకు హాస్పిటల్ హీమోటాలజీ వైద్యనిపుణురాలు డాక్టర్ శ్రావ్య, సుష్మిత, హీమోఫిలియా హైదరాబాద్ సోసైటీ అధ్యక్ష,కార్యదర్శులు చంద్రశేఖర్ రావు, సుభాష్ చంద్ర, ఇంటాక్ ఫౌండేషన్న ప్రతినిధి కరుణాకర్ ఉచిత ఇంజక్షన్లను అందించారు. హీమోఫిలియా వ్యాధి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలపై వైద్యులు అవగాహన కల్పించారు.