హైదరాబాద్, ఆంధ్రప్రభ: కరోనా వ్యాక్సినేషన్ లో తెలంగాణ రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య సోమవారం సాయంత్రానికి 6 కోట్లు దాటింది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి #హరీశ్ రావు సిబ్బందికి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 3.11 కోట్ల మందికి మొదటి డోస్‌ను, 2.83 కోట్ల మందికి రెండో డోస్‌ను, 5.18 లక్షల మందికి ప్రికాషనరీ డోసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
12-14 ఏండ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 14ఏళ్లలోపు చిన్నారులకు మొత్తం 11.36 లక్షల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 19 శాతం పూర్తయిందన్నారు. కరోనా వైరస్ నుండి రక్షణ పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.