తెలంగాణ రాష్ట్ర అవతర దశాబ్ది వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మణం చెందాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లా హుజూరాబాద్నియోజకవర్గం కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన ఇనుగాల జయపాల్ కుమారుడు ధనుష్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులు ఈరోజు విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కిందపడి ధనుష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ర్యాలీ నిర్వహిస్తుండగా కుక్క ఒక్కసారిగా ధనుష్ మీదకు రావడంతో అతను భయపడి పక్కకు జరుగుతుండగా ట్రాక్టర్ కిందపడ్డాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, స్థానికులు తోటి విద్యార్థులు,ఉపాధ్యాయులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, విషయం తెలియగానే.. కమలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని బాలుడి మృతదేహాన్ని ఎమ్మెల్సీ పాడికౌషిక్రెడ్డి సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement