భద్రాచలం -‘ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు అనర్హత కేసు ఈరోజు వాయిదా పడటమే కాకుండా జనవరి 9వ తారీకు వాయిదా పడటం జరిగింది. దీనితో ఈ కేసు పసలేకుండా పోయింది. 2018 ఎన్నికల్లో గెలిచిన వనమా ను ఎలాగైనా కోర్టులో అనర్హుడిగా చేసి, తాను ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వాలని జలగం చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. జలగం ఈ నాలుగు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండకుండా, తన శక్తియుక్తులను కూడబెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోయింది.
ఈరోజు కూడా జలగం 9 గంటలకు సుప్రీంకోర్టుకు వచ్చి, సాయంత్రం నాలుగు గంటల దాకా సుప్రీంకోర్టులోనే తిష్ట వేయడం గమనార్హం. ఎలాగైనా వనమాను అనర్హుడిగా చేయాలని జలగం ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. వనమాకు ఇది పూర్తి ఊరట కలిగించే విషయం. దీనితో జలగంకు పెద్ద దెబ్బ తగిలినట్లు అయింది..