గణపురం (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కర్కపల్లి గ్రామంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కట్ల ప్రమీల కుటుంబం ఆదివారం ఉదయం మంచిర్యాలలోని శుభకార్యానికి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందర వందరగా కనిపించాయి.
బీరువాలో దాచుకున్న 5 తులాల బంగారం, అర కిలో వెండి. రూ. 75వేల నగదు అపహరించుకు పోయినట్లు బాధితులు తెలిపారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించగా భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్, క్లూస్ టీం తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.