Friday, November 22, 2024

మిషన్‌భగీరథ పైపుల నుంచి మురికినీరు.. ఆందోళనలో ప్రజలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నీటిని ఏమాత్రం శుద్ధి చేయకుండానే మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పుడు మిషన్‌ భగీరథ పైపుల నుంచి మురికి నీళ్లు వస్తున్నాయని జనం ఆరోపిస్తున్నారు. గోదావరి నీటిని ప్రమాణాల మేరకు శుధ్ది చేయకుండానే ఇళ్లకు వదులుతుండడంతో వాటిని వినియోగించిన తాము అనారోగ్యం బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. మిషన్‌ భగీరథ నీరు సురక్షితమైనదని ఇటీవల ప్రభుత్వ పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో చాలా జిల్లాల్లో జనం ప్రయివేటు వాటర్‌ ప్లాంట్ల నీటిని పక్కన బెట్టి మిషన్‌ భగీరథ నీటినే తాగునీటి అవసరాలతోపాటు వంట చేసేందుకు వినియోగిస్తున్నారు.

వరద ఉధృతి అధికంగా ఉన్న భద్రాచలంతోపాటు రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ పట్టణం, జనగామ జిల్లా కేంద్రం తదితర ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ పైపుల నుంచి మురికి నీరు వస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే మిషన్‌ భగీరథ కింద సరఫరా చేస్తున్న గోదావరి నీళ్లు చాలా మురికిగా ఉంటున్నాయని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌ భగీరథ నీరు మురికిగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల ప్రజలు ఆ నీటిని తాగేందుకు జంకుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement