Sunday, September 29, 2024

ఆర్టీసీ బస్టాండ్ లో మురికి కూప్ప‌లు, గుంతలు.. ప‌ట్టించుకోని అధికారులు..

బిచ్కుంద, (ప్రభ న్యూస్‌) : కామారెడ్డి రీజియన్‌ పరిధిలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌ రోజురోజుకూ ఆధ్వానంగా మారుతోంది.. బస్టాండ్‌లో ప్లాట్‌ఫారాలు ఉన్నా ప్రయాణికులు కూర్చోవడానికి అను కూలంగా లేవు.. ఏళ్ల తరబడిగా సరైన మం చి నీటి సౌకర్యం లేదు.. మరుగుదొడ్లు అపరి శుభ్రంగా ఉన్న ప్రాంతంలో తాగునీటి సౌక ర్యం ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు ఆవైపుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నా రు. ప్రయాణికుల వినోదం కోసం ఏర్పాటు చేసిన ఒక్క టీవీ కూడా పని చేయడం లేదు. సరిపడా కుర్చీలు కూడా లేకపోవడంతో బస్సులు వచ్చేంత వరకు ప్ర యాణికులు గంటల తరబడి నిలబడే ఉంటున్నారు.

ఇక బస్టాండ్‌ ఆవరణ గురించి చెప్పాలంటే మరీ ఆధ్వానంగా మారుతోంది. బస్టాండ్‌లో మురినీరు ప్రతినిత్యం పారుతూనే ఉంది.. ఈ సమస్యకు ఏళ్ల తరబడిగా పరిష్కారం చూపడం లేదు. బస్టాండ్‌ ముందు భాగంలో ఆవరణలో ప్రమాదకర గుంతలు తయారయ్యాయి. కనీసం మరమ్మతులు చేయక అధికారులు చేతులేత్తేశారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చెత్త, మురుగునీరు వాసనతో మురికి కూపంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు.

బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిలువ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోం దన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో ని హోటళ్లు, మిర్చి బండ్ల వ్యాపారులు తిను పదార్థాల వ్యర్థాలు అక్కడే పారవేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆటోలను బస్సలుకు అడ్డం గా నిలుపుతూ.. బస్టాండ్‌లో ఆటోలను నిలిపినా సంబంధిత ఆర్టీసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. భారీ వర్షాలు కురిస్తే బస్టాండ్‌ ఆవ రణలోకి మురికి నీరు వస్తోందంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement