హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈ నెల 8 వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో పూర్తిస్థాయి కేసుల ప్రత్యక్ష విచారణకు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులోనూ పూర్తిస్థాయి విచారణ జరగనున్నాయి. కోవిడ్ కారణంగా కొంత కాలంగా కోర్టుల్లో పాక్షిక ఆన్‌లైన్, ఆఫ్ లైన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని కేసులు ప్రత్యక్షంగినే విచారణ జరుగనున్నాయి.
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు మేరకు తొమ్మిది మంది న్యాయవాదులకు సీనియర్ హోదా కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అబ్ధుల్ ముఖీత్ ఖురేషీ, పి. నాగేశ్వరరావు, బి. నారాయణరెడ్డి, జె. ప్రభాకర్, ఎం. ప్రభాకర చంద్రమౌళి, ప్రతాప్ నారాయణ సంఘీ, జె. రామచంద్రరావు, రవీందర్‌రెడ్డి అయ్యాడపు, ఇవి వేణుగోపాల్‌లకు సీనియర్ న్యాయవాది హోదా లభించింది.