న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుతూ ఓ అభిమాని వినూత్న రీతిలో కాశీ విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నాడు. తెలంగాణకు చెందిన సాయి ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో శుక్రవారం సాయంత్రం దీపారాధన కార్యక్రమం నిర్వహించి, గంగా నదిలోని బోట్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.
దేశ్కా నేత కేసీఆర్ అంటూ కేసీఆర్, కేటీఆర్, కవితతో పాటు ఇతర టీఆర్ఎస్ నాయకుల ఫొటోలను బోట్ల మీద ఏర్పాటు చేశాడు. కాశీ విశ్వనాథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలని ప్రార్థిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశానని సాయి చెప్పుకొచ్చాడు.