Friday, November 22, 2024

GADWAL : పోలీస్ అన్నలు జర జాగ్రత్త.. శిథిలావస్థలో పోలీస్ క్వార్టర్స్..

గద్వాల ప్రతినిధి, అక్టోబర్ 29 (ప్రభ న్యూస్)
గద్వాల పురపాలక సంఘం పరిధిలోని రెవెన్యూ కాలనీకి సమీపంలో సుమారు 1991-92 సంవత్సరంలో ఏపీ ఎస్పీ వారి కోసం పోలీస్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేశారు. పోలీసుల కొరకు ఏర్పాటుచేసిన ఈ క్వార్టర్స్ లో మొత్తం ఆరు బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 8 కుటుంబాలు నివాసం ఉండేందుకు ఇక్కడ క్వార్టర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ ఎస్పీ పోలీస్ లతోపాటు ఇద్దరు ఎస్ఐలు ఒక సీఐ ఉండేందుకు ఇక్కడ బ్లాక్ లను ఏర్పాటు చేయడం జరిగింది. 1992 సంవత్సరంలో అప్పటి మంత్రి సమరసింహారెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన పోలీస్ క్వార్టర్స్ కాలక్రమమైన సంవత్సరాలు గడిచే కొద్దీ శిథిలావస్థకు చేరుకున్నాయి.

1992 సంవత్సరం నుంచి అక్కడ ఏపీఎస్పీ పోలీసులతోపాటు సివిల్ పోలీసు కుటుంబాలు కూడా నివాసం ఉంటూ వచ్చారు. ఇక్కడ పోలీసులకు ఏర్పాటు చేసిన ఈ క్వార్టర్స్ 2016 లో ఒక్కొక్కటిగా శిథిలావస్థకు చేరుకున్నది. శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్ ను డిస్మెంటల్ చేయాలని 2018 లోనే ఆర్డర్స్ విడుదల చేశారు. శిథిలావస్థకు చేరుకున్న క్వార్టర్స్ ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో అన్న సందర్భంలో 2018 సంవత్సరంలో క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న పోలీస్ కుటుంబాలను ఖాళీ చేయాలని నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. 2018 సంవత్సరంలో శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న కుటుంబాలు ఖాళీ చేయాలని చెప్పినప్పటికీ అన్ని కుటుంబాలు అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోట్లకు వెళ్లారు. కానీ కొంతమంది పోలీస్ కుటుంబాలు మాత్రం శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్ నివాసాల్లోనే జీవనం సాగిస్తున్నారని సమాచారం.

- Advertisement -

ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని ఈ క్వార్టర్స్ లో పోలీస్ అన్నలు నివాసం ఉండటం ఎప్పటికైనా ప్రమాదమే. క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న కుటుంబాలకు గవర్నమెంట్ తరఫున హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుందని, శిథిలావస్థలో ఉన్న నివాసాల్లో పోలీస్ కుటుంబాలు నివాసం ఉంటూ హెచ్ఆర్ఏలు కూడా తీసుకుంటూ ప్రమాదం అంచుటల్లో నివాసము ఉండటం చాలా ప్రమాదకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తున్నప్పటికీ శిథిలావస్థలో ఉన్న ఈ క్వార్టర్స్ లో ఉన్న పోలీసు కుటుంబాలు హౌస్ రెంట్ అలవెన్సులు తీసుకుంటూ ప్రమాదంగా మారిన పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉండటం ఎప్పటికైనా ప్రమాదమే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వర్షాకాలం వచ్చిందన్న, వరదలు వచ్చాయన్న, భారీ వర్షాలకు ప్రమాదకరంగా ఉండే ప్రదేశాలను అధికారులు గమనించి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పలుచోట్ల సోమనాద్రి కోట చుట్టూ ఉన్న ఇండ్లను వర్షాకాలం వచ్చిందంటే అధికారులు అప్రమత్తమై కోటకు ఆనుకొని ఉన్న ఇండ్లను ఖాళీ చేపించే జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు, పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకొని 2018లో డిస్మెంటల్ చేయాలని చెప్పినప్పటికీ అందులో నివాసం ఉంటున్న పోలీసుల కుటుంబాలు వీళ్లకు కనపడటం లేదా అని గద్వాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

గతంలో గద్వాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మున్సిపాలిటీ షాపులలో ఉన్న కూరగాయల మార్కెట్ శిథిలావస్థకు చేరుకున్నదని తెలుసుకున్న ఇంజనీరింగ్ అధికారులు ఆ కూరగాయల మార్కెట్లో ఉంటున్న వారిని ఖాళీ చేపించాలనే మున్సిపల్ అధికారులకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూరగాయల మార్కెట్లో ఉన్న వారిని కాలి చేయించకపోవడంతో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో పదుల సంఖ్యలో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో అక్కడ ఉన్న కూరగాయల మార్కెట్ ను కాళీ చేపించడంలో మున్సిపల్ అధికారులు ఆ సమయంలో సరియైన చర్యలు తీసుకోకపోవడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఇక్కడ నివాసం ఉంటున్న పోలీస్ కుటుంబాలు జాగ్రత్తపడి ప్రమాదాలు చోటు చేసుకోక ముందే అక్కడి నుంచి క్వార్టర్స్ ను కాళీ చేసే విధంగా జిల్లా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ ఐపీఎస్ వివరణ
ఇట్టి విషయంపై ఆంధ్రప్రభ జిల్లా రిపోర్టర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ ఐపీఎస్ కు వివరణ కోరగా.. శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న వారిని విచారించి అక్కడ నుంచి కాళీ చేపించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement