Saturday, January 11, 2025

TG | తెలంగాణ ప్రజలకు దిల్ రాజు సారీ…

తెలంగాణ రాష్ట్ర క్షమాపణలు చెప్పారు నిర్మాత దిల్ రాజు. ” సంక్రాంతికి వస్తున్నాం” ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకుంటున్నారని… తెలంగాణ బిడ్డను అయిన నేను నా తెలంగాణ కల్చర్ ని ఎందుకు అవమానిస్తాను ? అంటూ క్లారిటీ ఇచ్చారు. నిజంగా నా వ్యాఖ్యలతో మీరు బాధ పడి ఉంటే నన్ను క్షమించండి అంటూ వేడుకున్నారు నిర్మాత దిల్ రాజు.

మన తెలంగాణ సంప్రదాయాలను నేను గౌరవిస్తానని తెలిపారు. నేను తీసిన ఫిదా, బలగం లాంటి చిత్రాలను తెలంగాణ ప్రజలు ఎంతో ఆదరించారని పేర్కొన్నారు. దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగకండి కోరారు FDC ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు. కాగా… ” సంక్రాంతికి వస్తున్నాం” ఈవెంట్ లో తెలంగాణ వాళ్లు కళ్లు, మటన్‌, చికెన్‌ తింటారని దిల్‌ రాజ్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement