హైదరాబాద్,ప్రభన్యస్ : కొవిడ్ పరిస్థితుల్లొనూ ఓ వెలుగు వెలిగిన ఐటీ పరిశ్రమకు రాబోయే దశాబ్ద కాలం పాటు బూమ్ కొనసాగే పరిస్థితు లున్నాయని నాస్కామ్(నేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అసోసియేషన్) భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదివి బయటికి వస్తున్న విద్యా ర్థులను కంపెనీల అవసరాల మేరకు సిద్ధం చేసే విధంగా డిజిటల్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రానున్న 5 సంవత్సరాల్లో కనీసం 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు అత్యాధునిక డిజిటల్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఐటీ బూమ్ సుదీర్ఘ కాలం కొనసాగనుందన్న అంచనాల నేపథ్యంలో రానున్న రోజుల్లో చిన్ని, పెద్ద ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగుల కొరత ఎదుర్కొని, ఆట్రిషన్ సమస్యలో చిక్కుకోవచ్చని నాస్కామ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ కార్య క్రమాలు చేపట్టాలని యోచిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసా గుతున్న ఐటీ పరిశ్రమ బూమ్‌తో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లోనూ ఉద్యోగావకాశాలు పెరిగాయి. కొవిడ్ నేపథ్యంలో మారిన వ్యాపార నిర్వహణ మోడల్‌లతో ఐటీ పరిశ్రమకు ప్రస్తుతం బూమ్ కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటివరకు డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసమే కాకుండా ఇతర కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యా ర్థుల కోసం కంపెనీలు అణ్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
కొవిడ్ కారణంగా వచ్చిన మార్పులతో ప్రస్తుతం ఎంఎన్‌సీ కంపెనీలతో పాటు దేశీయంగా పేరొందిన కంపెనీలు కూడా స్థానికులకు భారీగా ఉద్యోగాలిస్తుండడం మంచి పరిణామమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 6 లక్షల మంది దాకా ఐటీ ఉద్యోగులు ఉండగా రానున్న ఐదేళ్లలో ఈ సంఖ్య 10 లక్షలకు చేరుకుంటుందని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 2021-26 ఐటీ పాలసీలో ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న ఐటీ బూమ్ ఇలాగే కొనసాగి కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటే సమీప భవిష్యత్తులో స్కిల్డ్ ఉద్యోగులకు కొరత కూడా ఏర్పడే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఐటీ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ నేపథ్యంలో కంప్యూటర్ కోర్సులు చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారు ఐటీ వైపు మొగ్గే అవకాశాలు ఉన్నాయని పలు కన్సెల్టెన్సీలు విశ్లేషిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily