Monday, November 18, 2024

డిజిటల్ సభ్యత్వ నమోదును 20 లోగా పూర్తి చేయాలి: నల్లెల్ల కుమారస్వామి..

ములుగు, (ప్రభ న్యూస్): కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుకు భూతు కమిటీలను ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి పిలుపునిచ్చారు. సోమవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా ఆధ్వర్యంలో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుకై మండల ఇంఛార్జీల మరియు మండల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి హాజరై జిల్లాలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుకు గాను భూతు కమిటీలు ఈ నెల 20 వరకు పూర్తి చేసి ఇవ్వాలని మండల అధ్యక్షులకు సూచించారు.

ములుగు నియోజకవర్గంలో 302 పోలింగ్ భూతులు ఉన్నాయని, మండల అధ్యక్షులు చొరవ తీసుకుని బూతు కమిటీలు వేయాలని, ప్రతి భూతుకు ఒక కన్వీనర్, ఒక సోషల్ మీడియా ఇంఛార్జి మరియు ఒక ఆపరేటరును ఎంపిక చేయాలని, ఎంపిక చేసిన జాబితా ఈ నెల 20 వరకు జిల్లా కార్యాలయానికి పంపించాలని అన్నారు. అలాగే ప్రతి భూతు నందు 100 మందికి తగ్గకుండా సభ్యత్వాలు నమోదు చేయించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద భీమా 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ సభ్యునికి వర్తింపజేస్తుందని అన్నారు.

దీని కోసం మండల అధ్యక్షులు వెంటనే చొరవ తీసుకుని, భూతు కమిటీలు వేసి, సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఎంపీటీసీ మావూరపు తిరుపతి రెడ్డి, ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్, మాజీ ఎంపీటీసీ ఇమ్మడి రాజు, మాజీ మండల అధ్యక్షులు కొండం రవీందర్ రెడ్డి, కిసాన్ సెల్ నాయకులు నూనేటి శ్యామ్, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి, సర్పంచ్ అల్లెం సదానందం, ఎర్రబెల్లి దేవేందర్ రావు, కంది శ్యామ్ సుందర్ రెడ్డి, పోరిక రేవంత్ నాయక్, నాగావత్ ప్రతాప్ తదితర నాయకులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement