సికింద్రాబాద్: సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరవేసేందుకే డిజిటల్ కార్డులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్ కార్డులు రావని.. ప్రజలు తమకు అధికారం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
“సంక్షేమ పథకాలు అందరికీ తీసుకురావాలనే కుటుంబ డిజిటల్ కార్డులు ఇవ్వాలని ఆలోచించాం. రేషన్ కార్డు కోసం ప్రజలు పదేళ్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. కొత్తగా కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచం” అని రేవంత్ రెడ్డి తెలిపారు.
- Advertisement -