- కానిస్టేబుల్, హోంగార్డ్ మధ్య ఘర్షణ
- ఇద్దరినీ సస్పెండ్ చేసిన ఎస్‌పీ
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో మామూళ్ల పంపకాల్లో తేడా రావడంతో పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో సంఘటనపై ఆరాతీశారు. అనంతరం పూర్తి వివరాలు తెలుసుకుని కానిస్టేబుల్, హోంగార్డుపై సస్పెన్షన్ వేటు వేశారు.
రూ.1500 మామూళ్ల కోసం…
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ.1500 మామూళ్ల కోసం కానిస్టేబుల్ రవి, హోంగార్డు శ్రీనివాస్ మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు.