Monday, November 18, 2024

అమిత్ షాతో రాజకీయాలపై మాట్లాడలేదు : రాజగోపాల్ రెడ్డి

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను కలిసిన మాట వాస్తవమేనని.. అయితే అమిత్ షాతో రాజకీయాలపై మాట్లాడలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో రాచరికపు పాలన కొనసాగుతోందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాన‌న్నారు. పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కు ఎందుకో భయం పట్టుకుందన్నారు. తాను రాజీనామా చేస్తే డబ్బు పెట్టి గెలవాలని చూస్తున్నట్లున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండడంతో ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement