ఉట్నూర్, జూన్ 25, ప్రభన్యూస్ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం.దనోర (బి) గ్రామ శివారులో కుడిమెతి జంగుబాయిని హత్యచేసి బావిలో పడేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి, కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయం ముందు ప్రధాన రోడ్డుపై ఆదివారం సాయంత్రం తుడుందెబ్బ ఆధ్వర్యంలో అదివాసుల దర్నా చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక డిఎస్పీ నాగేందర్, ఎస్సై భరత్ సుమన్, నిందితులను పట్టుకొని చట్యరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా ఇంచార్జి పీఓ వరుణ్ రెడ్డితో కల్పించగా పీఓ బాధిత కుటుంబ సభ్యులతో నాయకులతో మాట్లాడుతూ… త్వరలోనే అరెస్టు చేసి చర్యలు తీసుకుంటారని, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు హత్యకు గురైన బాధితురాలు కుమారుడు భీమ్రావును గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిస్తామని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని పీఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, బీఆర్ఎస్ నాయకులు మరసుకొల తిరుపతి, పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు సునీల్ జాదవ్, మహిళా నాయకురాలు పుష్ప రాణి, నాయకులు ఆదివాసి, గిరిజనులు పాల్గొన్నారు.