శంషాబాద్ (ప్రభ న్యూస్) : శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సిద్ధాంతి జాతీయ రహదారిపై స్థానికులు శవంతో బయటయించి ధర్నాకు దిగారు. గత కొద్ది కాలంగా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ముందుకు పొడిగించాలని స్థానికులు ఎంపీ రంజిత్ రెడ్డి విన్నవించారు.. అయితే బ్రిడ్జి పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదు.. ఈ నేపథ్యంలో సిద్ధాంతి కి చెందిన యాదయ్య రోడ్డు క్రాస్ చేస్తుండగా అతివేగంగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. దాంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. దీంతో సిద్ధాంతి కి చెందిన గ్రామస్తులు బ్రిడ్జి పనులు మల్లిక కన్వెన్షన్ వరకు పొడిగించాలని కోరుతూ యాదయ్య మృతదేహంతో జాతీయ రహదారిపై భైఠాయించారు. . దీంతో నేషనల్ హైవే రోడ్డు నాలుగు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది . విషయం తెలుసుకున్న శంషాబాద్ ఆర్.జి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నత అధికారులతో ఈ బ్రిడ్జి పనులను చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. . ధర్నా చేస్తున్న స్థానికులను అక్కడి నుంచి పంపి వేసి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు పోలీసులు.
Advertisement
తాజా వార్తలు
Advertisement