దేశంలో ఎంత భిన్నత్వం ఉన్నా.. మన ఐక్యతకు ధర్మమే ప్రాతిపదికని తెలంగాణ ఇంచార్జ్ గవర్నర్ ఆర్ రాధాకృష్ణన్ హితవు పలికారు. మంగళవారం ముచ్చింతల్‌లో స్వర్ణ భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ రాధాకృష్ణన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.
- Advertisement -
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో ఆధునిక అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధన, ఆవిష్కరణల ద్వారా సమాజం వేగంగా ముందుకెళ్తుందన్నారు. పంచాంగ శ్రవణ శాస్త్రీయతను అర్థం చేసుకుని ముందుకు సాగాలని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని కొనియాడారు. తెలుగు భాష చాలా గొప్పదని కొనియాడారు. క్రోధి నామ తెలుగు సంవత్సరం కొత్త ఆరంభమన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించడం అద్భుతమని ప్రశంసించారు.