Friday, November 22, 2024

భూస్వాముల కోసమే ధరణి… రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ పేదల కోసం కాదని, భూస్వాముల కోసం మాత్రమేనని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ లో నిర్వహించిన ధరణి అదాలత్ గ్రామ సభలో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం 22లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా 9 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు.

రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో ధరణి అదాలత్ నిర్వహించి బాధితుల నుండి దరఖాస్తు స్వీకరించి వారికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. 2024 జనవరి 1 తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపడుతుందని, అప్పటినుండి 100 రోజుల్లో ధరణి సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. ధరణి పోర్టల్ ను ఫిలిపిన్స్ కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement