Tuesday, November 19, 2024

Dharani: స‌చివాల‌యంలో ధ‌ర‌ణి క‌మిటీ స‌మావేశం….వక్ఫ్‌ బోర్డు, దేవాదాయ భూములపై చ‌ర్చ‌…

తెలంగాణలో భూ సమస్యలను పరిష్కరించడానికి నేడు మరోసారి ధరణి కమిటీ సమావేశం జరగనుంది. ఈ స‌మావేశంలో క‌మిటీ ప్ర‌తినిధులు వక్ఫ్‌ బోర్డు, దేవాదాయ భూములపై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. సర్వే, సెటిల్మెంట్‌ విభాగం ద్వారా రికార్డుల నిర్వహణ, భూ భారతి కార్యక్రమం, ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌లు, ధరణి పోర్టల్‌ కింద తీసుకున్న మ్యాప్‌ల తాజా పరిస్థితిపై ఈ కమిటీ ఆరా తీయనుంది.

వీటి సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోక పోవడంతో కాలక్రమంలో వేల ఎకరాల భూమలు అన్యాక్రాంతం అవుతున్నాయి.
ఎండోమెంట్‌, వక్ఫ్‌ బోర్డు పరిధిలో ఉన్న భూములు, ఆస్తులను కాపాడుకోవాటానికి, రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖలు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో ధరణి కమిటీలో చర్చించనున్నారు. ఈ సమవేశంలో సీసీఎల్‌ కమిషనర్‌, కమిటీ కన్వినర్‌ నవీన్‌ మిట్టల్‌, సభ్యులు ఎం. కోదండరెడ్డి, రేమండ్‌ పీటర్‌, వి. లచ్చిరెడ్డి, సునీల్‌, మధుసూదన్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement