ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో మరోసారి సమావేశం కానుంది. ఈసారి అటవీ, గిరిజన సంక్షేమ, వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకానున్నారు.
ధరణిలో క్షేత్రస్థాయి సమస్యల గురించి ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కొన్ని వివరాలు కమిటీ సేకరించింది. రెవెన్యూ శాఖతో సంబంధం ఉన్న ఇతర శాఖలపై దృష్టి పెట్టింది. ఈ సందర్భంగా అటవీ భూములు, సరిహద్దులకు సంబంధించి ధరణిలో ఉన్న వివరాలు, పోర్టల్‌తో కలిగిన ప్రయోజనం, లోపాలు ఏవైనా ఉన్నాయా? వంటి వివరాలను కమిటీ చర్చించనున్నారు.