Friday, November 22, 2024

ధాన్యం కొనుగోలు పకడ్బందీగా పూర్తి చేయాలి – కలెక్టర్ జి.రవి

కథలాపుర్ ధాన్యం కొనుగోలు పకడ్బందీగా నిర్వహించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు. మండలంలోని బొమ్మెన, తండ్రియాల , సిరికొండ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా కలెక్టర్ పరిశీలించారు.రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, కొనుగోలు కేంద్రాలు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులతో కలెక్టర్ చర్చించారు, రైతులు ఇంటి వద్ద ధాన్యం ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కలెక్టర్ సూచించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలులో వేగం పెంచాలని సెంటర్ ఇంఛార్జిలను ఆదేశించారు ,నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యము 17% తేమశాతం వచ్చినవి,ప్యాడి క్లినింగ్ చేసిన అనంతరం ఎక్కువమంది హమాలిలను ఏర్పాటు చేసుకుని లారీల లో లోడ్ చేసుకుని మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం కేంద్రాలలో ఉన్న ధాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా గా పరిశీలించారు ధాన్యం కొనుగోలు కేంద్రం లోని రిజిస్టర్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రణాళికబద్ధంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించడానికి టోకెన్ సిస్టం అమలు చేయాలని , టోకెన్ సిస్టం ప్రకారం తేమ వచ్చిన తరువాత తూకం వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఆర్.డి.ఓ కొరుట్ల వినోద్ కుమార్, డి.ఆర్.డి.ఓ.ఓ, డి.సి.ఎస్.ఓ, డి.సి.ఓ., ఎం.పి.డి.ఓ.లు., తహసీల్దార్ రాజేందర్,ఎంపీడీఓ నవిన్,ఏ,పి,మ్, నరహరి,ఎమ్,పి,ఓ,ప్రవీణ్, వైస్ ఎంపీపీ గండ్ర కిరణ్ రావు, సర్పంచులు పిడుగు లావణ్య తిరుపతి రెడ్డి, గడిలా గంగప్రసాద్,గాండ్ల వీణ.ఎంపీటీసీ దొప్పల హైమవతి జలందర్, స్థానిక ప్రజా ప్రతినిధులు సింగిల్విండో చైర్మన్ చుక్క దేవరజం,ఎం సి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement