పంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ శివధర్‌రెడ్డి దర్శించుకున్నారు. మేడారం జాతర సందర్భంగా గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
అనంతరం నోడల్ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ…… ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతర సమ్మక్క-సారలమ్మ జాతరకి 2 కోట్లకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రాబోయే 4 రోజులు జాతర నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కోరారు.సిబ్బందికి డ్యూటీ పాయింట్ల వద్ద సరైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణ అనుగుణంగా తగిన సిబ్బందిని కేటాయించి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డీజీపీ వెంట వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి,ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం, ఇతర అధికారులు ఉన్నారు