Sunday, November 24, 2024

TG | డీజీ జితేందర్‌కు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బాధ్యతలు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరిగా విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, డీజీ జితేందర్‌కు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న శాఖలతో పాటు అదనంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతలను అప్పగించినట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

భారీ ప్రక్షాళన..

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగియడంతో ప్రభుత్వం పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో భారీ ఎత్తున ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. డీజీపీ, పలువురు పోలీస్‌ కమిషనర్లు సహా పలు కీలక పోస్టుల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం తప్పదనే చర్చ జోరుగా నడుస్తోంది.

కీలక బాధ్యతల్లో కొత్త అధికారులను నియమించడంతో పాటు ఇప్పటికే ఒకటికి మించి అదనపు పోస్టులతో పని భారం ఉన్న అధికారులకు ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మూడు కమిషనరేట్‌లలో సీపీలలోనూ మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement