Wednesday, January 15, 2025

Devotional – ఖాందేవుని జాతరలో వింత ఆచారం….

ఆంధ్రప్రభ స్మార్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విధిగా పాటించే ఆదివాసులు పుష్య మాసంలో వచ్చే పండుగలకు విశేష ప్రాధాన్యతనిస్తారు. పుష్య మాసం తొలిరోజు పౌర్ణమి సందర్భంగా ఆదివాసి గిరిజన తెగకు చెందిన తొడసం వంశస్థులు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్​లో వ్యవసాయ పొలంలో కొలువైన తమ ఆరాధ్య దైవం ఖాoదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ఉత్సవాలను ప్రారంభించారు.

తెలంగాణతో పాటు సరిహద్దు మహారాష్ట్ర, చత్తీస్గడ్ నుండి తొడసం వంశస్థులు చేరుకొని కులదైవం పెర్సపెన్ కు పూజలు నిర్వహించారు. వైవిద్యంగా తొలి మొక్కులతో సాగే ఖాందేవుని జాతర సాంప్రదాయ రీతిలో ప్రారంభం కాగా ఈనెల 27 వరకు జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. తమ ఆచారం మేరకు నియమనిష్ఠలతో ఆదివాసులు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

- Advertisement -

రెండున్నర కిలోల నూనె తాగిన ఆదివాసి ఆడపడుచు
ఖాందేవ్ జాతర ప్రారంభం సందర్భంగా తొడసం వంశస్థులు ఆలయంలో తమ ఆరాధ్య దైవాలకు సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, మహారాష్ట్రలోని కేలాపూర్ ఎమ్మెల్యే తొడసం రాజు సమక్షంలో ఆదివాసి ఆడపడుచు నాగోబాయి రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొక్కులు చెల్లించుకున్నారు. తొడసం వంశస్థులు సుఖశాంతులతో ఉండాలని, పంటలు బాగా పండాలని కోరుతూ పూజలు గావించారు. చిత్తగూడ, మాన్కాపూర్ లో స్వయంగా నువ్వుల నూనెతో గానుగ తీసి ఆ నూనెను తమ దేవతలకు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆడపడుచులు రోకలితో వడ్లు దంచి కొత్త బియ్యంతో నైవేద్యాలు సమర్పించి మహా పూజల్లో పాలుపంచుకున్నారు. ఖాoదేవుని జాతర అనంతరం ఈనెల 28 నుండి కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement