వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అర్చక బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్వామి వారి సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు…
.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు అర్చక బృందం, ఆలయ కమిటీ మేళ తాళాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు..
అనంతరం ఆది స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు.అనంతరం వేదపండితులు ఆశీర్వచన మండపంలో ప్రభుత్వ విప్ కు వేదోక్త ఆశీర్వచనం గావించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనాలు పొందుతున్నానన్నారు.
పురాతన ఆలయం మన ప్రాంతంలో ఉండటం మనకు ఎంతో పుణ్యఫలం అన్నారు.. ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నానన్నారు. కార్యక్రమంలో గ్రామ మాది సర్పంచ్ ఆలయ కమిటీ అర్చక బృందం గ్రామ పెద్దలు పాల్గొన్నారు.