Saturday, January 25, 2025

Devotional – గడికోట మ‌హాదేవుని ఆల‌యంలో ప్రియాంకా చోప్రా ప్ర‌త్యేక పూజలు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బాలీవుడ్‌ స్టార్‌ నటి, గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ ఆల‌యాల‌ను సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను సంద‌ర్శించిన ఆమె శుక్ర‌వారం కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోట మహాదేవుడి ఆలయాన్ని ప్రియాంక సందర్శించారు.

గ‌డికోట మ‌హాదేవునికి ప్ర‌త్యేక పూజ‌లు
హైదరాబాద్‌ నుంచి కారులో బయల్దేరి దోమకొండ చేరుకున్నారు. అక్కడ గడికోటలో కొలువుదీరిన ప్రసిద్ధ మహాదేవుని ఆలయానికి వెళ్లారు. ఆలయంలోని సోమసూత్ర శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది. పొగమంచుకు సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

- Advertisement -

మ‌హేశ్‌బాబుతో న‌టించేందుకే హైద‌రాబాద్ వ‌చ్చిన ప్రియాంక‌

పాపులర్ అమెరికన్‌ సింగర్‌ నిక్ జోన‌స్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కు పరిమితమ‌య్యారు. ఎస్‌ఎస్‌ఎంబీ 29తో మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రెడీ అవుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్రియాంకా చోప్రా టొరంటో నుంచి హైదరాబాద్ వ‌చ్చిన‌ట్లు సినీ ప‌రిశ్ర‌మ టాక్‌. ప్ర‌ముఖ హీరో మ‌హేశ్‌బాబు ప‌క్క‌న చేయ‌బోతున్నార‌ని వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ప్రియాంకా చోప్రా.. ఆర్‌ఆర్‌ఆర్ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి , మహేశ్ బాబు కాంబినేష‌న్‌గా వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్‌ ప్రాజెక్ట్‌ ఎస్‌ఎస్‌ఎంబీ 29 అనౌన్స్‌మెంట్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిందని నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే ఐదేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా చేయబోతున్న భారతీయ సినిమా ఎస్‌ఎస్ఎంబీ 29 కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement