ఆంధ్రపభ స్మార్ట్ – హైదరాబాద్ – తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమైన దేవాలయాలకు మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
గతంలో అధికారులు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించేవారని ఈసారి ప్రజల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తూనే మంత్రులను భాగస్వామ్యం చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బోనాల నిర్వహణకు చెక్కుల పంపిణీ పూర్తయ్యాయని , గతంలో ఎన్నడూ లేనివిధంగా 10% అదనంగా దేవాలయాలకు నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.
ఈనెల 28వ తేదీన దేవాలయాల వారిగా పట్టు వస్త్రాలు సమర్పించే మంత్రుల వివరాలను తెలిపారు.
శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
శ్రీ అక్కన్న మాదన్న ఆలయం, శాలిబండ – మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
శ్రీ భాగ్య లక్ష్మి ఆలయం, చార్మినార్ – మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి
శ్రీ దర్బార్ మైసమ్మ టెంపుల్ , కర్వాన్ – మంత్రి దామోదర రాజనర్సింహ
శ్రీ మహంకాళి టెంపుల్, మిరాలం మండి – మంత్రి జూపల్లి కృష్ణారావు
నల్ల పోచమ్మ ఆలయం, సబ్జి మండి – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
శ్రీ కట్ట మైసమ్మ ఆలయం, చిలకలగూడ – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
శ్రీ ఖిలా మైసమ్మ ఆలయం , ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ – మంత్రి దనసరి అనసూయ సీతక్క
శ్రీ మహంకాళి సహిత మహకాళేశ్వర స్వామి ఆలయం , నాచారం ఉప్పల్ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి