Saturday, November 16, 2024

Devotional – ఖైరతాబాద్ మహా గణపతి హుండీ ఆదాయం ఎంతంటే

హైదరాబాద్ : తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి రేపు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఇక రేపు ఉదయం 7 గంటలకే గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. అయితే.. ఈ 9 రోజులు గణనాథుడికి ఘనంగా పూజలు చేశారు. అంతేకాకుండా.. భారీ సంఖ్యలో వచ్చి భక్తులు గణేషుడిని దర్శించుకున్నారు. కేవలం నగరంలో ఉండే వారే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా గణనాథుడిని దర్శించుకున్నారు.

దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో.. భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది.

- Advertisement -

రూ. 70 లక్షలు కానుకల ద్వారా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే.. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు సమకూరినట్టు సమాచారం..

అంతేకాకుండా.. ఆన్లైన్ ద్వారా, గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల (గూగుల్ పే) ద్వారా కూడా కొంత విరాళాలు వచ్చాయి.. వాటిని లెక్కించాల్సి ఉంది. కాగా.. ఖైరతాబాద్‌లో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిసారి హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగడం విశేషం.

చివరి రోజు భక్త జన ప్రభంజనం

బడా గణేష్‌ను దర్శించుకునేందుకు చివరి రోజు కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. దీంతో వెల్డింగ్, కర్ర తొలగింపు పనులకు ఆటంకం కలుగుతుంది. భక్తులను రోప్ సహాయంతో ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద నుంచి పంపించేస్తున్నారు పోలీసులు. మరోవైపు.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement