Sunday, November 3, 2024

Devotional – పాల‌మూరు క్షేత్రాలకు కార్తీక శోభ‌

ఆంధ్రప్రభ స్మార్ట్‌, పాలమూరు ప్రతినిధి : ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఆల‌యాలు కార్తీక శోభ‌ను సంత‌రించుకుంటున్నాయి. కార్తీక తొలి సోమ‌వారం పూజ‌లకు అన్ని ఆల‌యాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆల‌యాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల‌య పాల‌క‌వ‌ర్గాలు, అర్చ‌కులు ఏర్పాట్లు చేశారు.

కార్తీక మాసంలో కురుమూర్తి దేవాల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌తి రోజూ ఆధ్యాత్మికోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.పాల‌మూరు ఆల‌యాలు…ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం వ‌చ్చిందంటే ఆధ్యాత్మిక ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు.

కృష్ణ, తుంగభద్రల సమాహారాలను సమన్వయం చేస్తూ శివకేశవ క్షేత్రాలు వెలిశాయి. శ్రీశైల క్షేత్రానికి అనుబంధంగా ఉన్న ఉమామహేశ్వరం, కృష్ణ తుంగభద్ర సంగమ క్షేత్రంలో ప్రముఖ శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ దేవి ఆలయం.

+ అచ్చంపేట అమరాబాద్ సువిశాల మైన అభయారణ్యాన్ని చేర్చుకునే సహజ సిద్ధ మల్లెల తీర్థం

+ అలంపూర్ పది కిలోమీటర్ల దూరంలో ఆరు నదుల సంగమ క్షేత్రంలో విశాలమైన మట్టి దిబ్బపై వెలసిన స్వయంభు శ్రీ సంగమేశ్వర ఆలయం.

- Advertisement -

+ కాశీ తర్వాత పాలమూరు జిల్లాలోని కందూరులో శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో కల్ప వృక్షాలు నెలవు.

+ శ్రీ రంగనాథ స్వామి ఆలయం, పేదల తిరుపతి పలువుగా ప్రత్యక్ష దైవంగా శ్రీ మన్నెకొండ వెంకటేశ్వర స్వామి ఆలయం.

+ కృష్ణానది తీరాన వెలసిన శ్రీ ఆంజనేయస్వామి, చిన్న రాజమూరు ఊరకొండ పద్ధతి ఆంజనేయ స్వాముల ఆలయాలు ప్రత్యేక ఆధ్యాత్మిక క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి.

కురుమూర్తి స్వామి చ‌రిత్ర‌..

.తిరుమల గిరులందు వెలసిన వేంకటేశ్వరుడు ఆనందరాజ తనయ పద్మావతి చూసి వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. కల్యాణోత్సవం కోసం కుబేరుడి వ‌ద్ద అప్పు చేసి, చాలా కాలం పాటు వడ్డీ చెల్లిస్తూ వచ్చిన శ్రీనివాసుడిని వ‌డ్డితోపాటు అసలు డ‌బ్బులు కూడా ఇవ్వాల‌ని కుబేరుడు వెంటపడి ద్వారం దగ్గర తిష్ట వేసి ఉంటాడు. కుబేరుడు నిద్రిస్తున్న సమయంలో వెంకటేశ్వరుడు లక్ష్మీదేవితో కలిసి ఉత్తర దిశగా ప్రయాణిస్తూ కృష్ణ నది దాటుతారు. న‌ది దాటుతున్న‌ప్పుడు వారి పాద స్పర్శకు సంతోషించిన కృష్ణమ్మ ఇరువురికి పాదుకలను బహూకరించింది. నేటికీ ఆ పాదుకలను ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా కొత్తవి చేయించి తిరువీధి కార్య‌క్ర‌మం నిర్వహిస్తారు.

కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ఇదే. అలా చేరుకున్న శ్రీ‌వారు, ప‌ద్మావ‌తి కురుమూర్తి క్షేత్రాన్ని తిల‌కించారు. అయితే ప‌ద్మావ‌తి కోరిక మేర‌కు శ్రీనివాసుడు స్వయంభుడిగా కురుమూర్తి కొండలపై వెలిశాడు. ఇక్క‌డ ఆల‌యాన్ని ముక్కెర వంశ రాజులు నిర్మించారు. బంగారు నగలు చేయించారు. ఆలయ అభివృద్ధి కోసం రాజా సోం భూపాల్, శ్రీరామ్ భూపాల్ కృషి చేశారు. దాతల సహకారంతో కురుమూర్తి దేవాలయం దిన దిన అభివృద్ధి చెందుతూనే వస్తుంది.

వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు…

ఈ నెల 18వ తేదీ వ‌ర‌కూ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తారు. ఇందుకు ఆల‌య క‌మిటీ వారు ఏర్పాటు చేశారు. దీపావ‌ళి అమావాస్య రోజు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నెల 4న తొలి సోమ‌వారం రోజు సాయంత్రం శ్రీ‌వారి శేష‌వాహ‌న సేవ‌, 5న గ‌జ‌వాహ‌న సేవ‌, 6న స్వ‌ర్ణ ఆభ‌ర‌ణ తిరువీధి కార్య‌క్ర‌మంతోపాటు అశ్వ వాహ‌న సేవ‌, 7న హ‌నుమాద్వావాహ‌న సేవ‌, 8న ఉద్ద‌ల ఉత్స‌వం, గ‌రుడ వాహ‌న సేవ‌లు ఉంటాయి.

ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల కు వేలాది సంఖ్యలో భక్తులు వ‌చ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆల‌యాల వ‌ద్ద ఘ‌నంగా ఏర్పాట్లుతెలంగాణలోని అన్ని జిల్లాలతోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భ‌క్తులు వ‌చ్చి పాల‌మూరు జిల్లా ఆల‌యాల‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, పాలక వర్గాలు కూడా అందుకు సంబంధించి ఘ‌నంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement