Thursday, October 17, 2024

Devotional – మరి కొద్దిసేపటిలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం

హైదరాబాద్ – కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం జరుగనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు.

- Advertisement -

లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement