= పౌర్ణమి రోజున పోతేట్టిన భక్తజనం
=శివనామ స్మరణలతో మారుమోగిన ఆలయం
=జనసంద్రంగా త్రివేణి క్షేత్రం
మహాదేవపూర్, (ఆంధ్రప్రభ ) దక్షిణ అరణ్యశైవక్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో కార్తిక శోభ సంతరించుకుంది తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం తెల్లవారుజామునే మూడు నదుల కలయికైన ముచ్చటైన త్రివేణి సంగమములో పుణ్య స్థానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు 365 వత్తులు దీపాలను వెలిగించి గోదావరిలో వదిలిపెట్టారు గోదావరి మాతకు చీరే సారే సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు
అనంతరం ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయానికి చేరుకొని ఆలయంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి పాలాభిషేకాలు రుద్రాభిషేకాలు నిర్వహించి శుభనంద( పార్వతి) అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు వేలాది సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది ఆలయ ప్రాంగణమంతా స్వామి వారి నామ కీర్తనతో భజనలతో మారుమోగింది ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్ల కింద లక్ష ముగ్గులు వేసి లక్ష వత్తులు ద్వీపాలను వెలిగించారు ప్రత్యేకంగా సత్యనారాయణ వ్రతాలు నోములు నిర్వహించారు.
కాళేశ్వరం లో కార్తీక దీపాల కాంతులు దేవస్థానంలో కార్తీకమాసం సందర్భంగా ఆలయంలో దీపాల కాంతులతో కార్తీక శోభ సంతరించుకుం వేలాది మంది భక్తుల రావడంతో కాళేశ్వరం ఎస్సై చక్రపాణి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.