కూసుమంచి, ఆంధ్ర ప్రభ – కూసుమంచి మండల కేంద్రంలో పాత మజీద్,సెంటర్ అమ్మవారి విగ్రహం వద్ద 15వ వార్షికోత్సవ సందర్భంగా,విజయదశమి రోజున నవరాత్రులలో చివరి రోజైన శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం, సందర్భంగా గ్రామ సంక్షేమ నర్దాం శ్రీ లక్ష్మీ గణపతి రుద్ర సహిత చండీ హోమాన్ని, గౌడ సంఘనిర్వాహకులు నిర్వహించారు.
చండీ హోమాన్ని నిర్వహించిన పూజారులు,బెలిగిని ప్రదీప్, శరత్, మాట్లాడుతూ హిందు పురాణాల ప్రకారం అత్యంత శక్తి స్వరూపిణి చండీ. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించడానికి, ఆనందమైన జీవితాన్ని గడపడానికి, సిరి సంపదల కోసం చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని. పూజారి ప్రదీప్, తెలిపారు.
చండీ హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయని. చండీ హోమం చేసేటప్పుడు నవగ్రహాలను ఆవాహనం చేసుకుని చేయడం జరుగుతుందని. చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం లేదా అష్టమి నవములలో చేయడం మంచిదని, కానీ విజయదశమి రోజున చేయడం ఇంకా శ్రేష్టమని ఆయన అన్నారు.
అదేవిధంగా రుద్ర అనునది శివునికి మరొక నామము.శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము శివుని అనుగ్రహం పొంది తద్వారా అప మృత్యువు భయాలు తొలగింపబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులవుతారని పూజారి తెలిపారు. ఎవరైతే రుద్ర హోమం చేస్తారో వారు దీర్ఘాయుష్ని పొందడం జరుగుతుందని రుద్ర హోమం అత్యంత శక్తివంతమైనది అని ఆయన తెలిపారు.
సప్తశతిలో ఉన్నటువంటి 13 అధ్యాయాల ప్రకారం గా చండీ హోమం చేసేందుకు 13 రకాల విభిన్నమైన పదార్థాలను వాడడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్వపల్లి వెంకటేశ్వర్లు, వెంకన్న, అర్వపల్లి ఉపేందర్,టూటు బోడపట్ల నరేష్, చారి, మహేష్ గౌడ్, చంద్రయ్య, భవాని మాల ధారణ ధరించిన స్వాములు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం జరిగింది